ప్రకాశం: చీమకుర్తి పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఆకాశం మేఘామృతమై తేలికపాటి వర్షం మొదలైంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున బహిరంగ ప్రదేశాలు, టవర్లు, ఎత్తైన భవనాల వద్ద ఉండవద్దని అధికారులు సూచిస్తున్నారు.