GNTR: పొన్నూరు మండలం మునిపల్లెలో సోమవారం 40 మంది రైతులకు సబ్సిడీపై తైవాన్ స్ప్రేయర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తన చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఈ పంపిణీలో జనసేన సమన్వయకర్త వడ్రాణం మార్కండేయ బాబుతో పాటు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.