SRD: కార్మికుల సమస్యలపై హెచ్ఎంఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్ అన్నారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని చెప్పారు. కార్మికుల సంక్షేమం కోసం సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.