HYD: దీపావళి పండుగను పురస్కరించుకుని కంటోన్మెంట్ 8 వార్డులలోని దాదాపు 800 మంది పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందిని బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ సన్మానించారు. వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. పరిసరాల పారిశుద్ధ్యంలో కార్మికుల సేవలు అపూర్వమని ఆమె కొనియాడారు. వారి జీవితాలలో ఆనందం, వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.