ADB: దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. దీపావళి సందర్భంగా పట్టణంలోని పలు వ్యాపార, వాణిజ్య సంస్థల్లో నిర్వహించిన లక్ష్మీ పూజా కార్య క్రమాల్లో సోమవారం రాత్రి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆనందోత్సవాల మధ్య టపాసులు కాలుస్తూ పండగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.