E.G: అయినవిల్లి గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలైన అయినవిల్లి లంక, విరావల్లిపాలెం, అడ్డంకి వారి లంక గ్రామాల ప్రజలు ప్రతి ఏడాది గోదావరి వరదల కారణంగా నానా అవస్థలు పడుతున్నారు. వారందరూ రాకపోకలు సాగించే ముక్తేశ్వరం కాజ్వే వరద ముంపునకు గురవుతోంది. ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఎన్ని ప్రభుత్వాలు మారిన తమ పరిస్థితి ఇంతే అని అన్నారు.