టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించాడు. తన పేరుతో చాలా ప్రకటనలు నడుపుతుంటారని, ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని మండిపడ్డాడు. ‘నా భుజాలపై తుపాకీ పెట్టి కాల్చొద్దు’ అంటూ తనపై తప్పుడు ప్రకటనలు చేస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా, గంభీర్, గిల్ను.. గవాస్కర్ విమర్శించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.