SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో బాటలో విద్యుత్ శాఖ అధికారులు బస్తిబాట కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఏఈ స్వామి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి విద్యుత్ సరఫరా నాణ్యత పై అడిగి తెలుసుకున్నారు. కొన్నిచోట్లలో వోల్టేజి సమస్య ఉండడంతో పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.