AP: వైసీపీ నేతలు ‘చలో రాజయ్యపేట’కు బయల్దేరారు. బల్క్ డ్రగ్ పార్క్‌పై స్థానికుల నిరసనకు సంఘీభావం తెలపనున్నారు. రాజయ్యపేట ప్రజలకు అండగా ఉంటామని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. మరోవైపు ఈ కార్యక్రమంపై జిల్లా ఎస్పీ సిన్హా షరతులు విధించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు 48 మంది నేతలకే అనుమతి ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.