TPT: భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి రెవెన్యూ డివిజనల్ కార్యాలయం (ఆర్డీవో)లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తమను సంప్రదించాలని ఆర్డీవో రామమోహన్ సూచించారు. అధికారులు, కార్యాలయ సిబ్బంది అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వర్షాలతో ఏ సమస్య ఎదురైనా ప్రజలు 7032157040 నంబర్ కు కాల్ చేయాలని కోరారు.