KMR: బాన్సువాడ మండలం హన్మాజీపేటలో కొమురం భీమ్ జయంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసుల హక్కుల కోసం ఆలు పెరగని పోరాటం చేసిన వీరుడు కొమురం భీమ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేష్, ఆదివాసి సంఘం అధ్యక్షుడు సాయిలు, ఉపాధ్యక్షుడు పెంకటి గణేష్ పాల్గొన్నారు.