ADB: జిల్లాలో తరచూ కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. చేతికి వచ్చిన సోయా, మొక్కజొన్న పంటలు తడవకుండా ఉండేందుకు ధాన్యం కుప్పలపై టర్పాలిన్ కప్పుతూ అన్నదాతలు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేపడితే చేతికొచ్చిన పంటలు తడవకుండా తమ కష్టాలు తీరుతాయని రైతులు పేర్కొంటున్నారు.