BHNG: మద్యం షాపుల టెండర్లకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. అయితే వ్యాపారుల నుంచి అంతగా స్పందన కానరావడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జిల్లాలో 82మద్యం దుకాణాలకు సర్కారు ఆశించిన దానికంటే తక్కువ సంఖ్యలో 2,649 దరఖాస్తులు రాగా గతేడాది 3,900 దరఖాస్తులు వచ్చాయి. ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలనే సంకల్పంతో ఎక్సైజ్ శాఖ క్షేత్రస్థాయిలో పావులు కదుపుతోంది.