TPT: దొరవారిసత్రం ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో సోమవారం దొరవారిసత్రం పోలీసుల ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు వైభవంగా నిర్వహించారు. దొరవారిసత్రం SI అజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి సంబరాల్లో దాదాపు 60మంది బాలికలు పాల్గొని టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పోలీస్ సిబ్బంది విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.