NLG: కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. సోమవారం నాటికి 1,912 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తుండగా అధికారులు ఒక క్రస్ట్ గేటును తెరిచి 1,104 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమ కాలువలకు 293 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.