AP: మంగళగిరిలో ఇవాళ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు ఉదయం 7.30 గంటలకు ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని, అమరులైన పోలీసుల సేవలను స్మరించుకుని నివాళులర్పిస్తారు.