WNP: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సోమవారం ఎస్సై రజిత సూచించారు. వీటి వినియోగం సరదాగా మొదలై వ్యసనంలా మారి జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు. మత్తు పదార్థాలు కలిగి ఉండడం, సేవించడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని, చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత వాటికి దూరంగా ఉండి, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆమె కోరారు.