KKD: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ సూచించారు. కలెక్టరేట్లో 0884-2356 801 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు బుధవారం రాత్రి తెలిపారు. వర్షాలు తగ్గే వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.