NRML: సోయా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, రైతాంగానికి మద్దతు ధర కల్పించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఎమ్మెల్యే రామారావ్ పటేల్ వినతి పత్రాన్ని అందించారు. బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి మంత్రిని కలిశారు. మార్కెట్లో సొయాపంటకు ధర లేక రైతులు భారీ స్థాయిలో నష్టపోతున్నారని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరారు.