ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రాణాంతకంగా మారింది. అర్థరాత్రి వేళ AQI ఏకంగా 1,991 పాయింట్లకు చేరింది. దీనిపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పందిస్తూ, ‘ఇదీ మన ఢిల్లీ’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో కాలుష్యం సగటున 475 పాయింట్లతో కొనసాగుతోంది. మొత్తం మీద నగరంలో 1,127 పాయింట్ల కాలుష్యం నమోదైంది. దీపావళికి ముందు నుంచే సగటున 400 పాయింట్ల AQI నమోదవుతున్న విషయం తెలిసిందే.