ADB: పోలీస్ అమర వీరుల త్యాగాలను స్మరించడానికి ఏటా అక్టోబర్ 21న సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్లో నిర్వహించే సంస్మరణ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు. మావోయిస్టుల అలజడి, సంఘవిద్రోహ శక్తుల చర్యలు లేకుండా ప్రశాంత వాతావరణం కల్పించడం కోసం ఎంతో మంది పోలీసులు ప్రాణాలను త్యాగం చేశారు.