‘ఆపరేషన్ సింధూర్’కు శ్రీరాముడే స్ఫూర్తి అని ప్రధాని మోదీ ప్రజలకు రాసిన లేఖలో తెలిపారు. ఈ ఆపరేషన్లో భారత్ తన నీతిని నిలబెట్టుకుంటూనే.. ఉగ్రవాదంపై ప్రతీకారం తీర్చుకుందని ప్రధాని పేర్కొన్నారు. భారత సైన్యం ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, శత్రువులకు గట్టి గుణపాఠం నేర్పించిందని ఆయన కొనియాడారు. ఈ చర్య భారతదేశపు ధైర్యాన్ని, సంకల్పాన్ని చాటిందని మోదీ వివరించారు.