ATP: పామిడిలో వెలసిన భోగేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం పూజలను ఘనంగా నిర్వహించారు. ఉదయం అర్చకులు అభిషేకాలు నిర్వహించి స్వామికి పూజలు చేశారు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుండటంతో ఏర్పాట్లు పూర్తి చేశామని అర్చకులు తెలిపారు.