HYD: నగరంలో టపాసుల మోత మోగిపోయింది. దీంతో దాదాపుగా 6 టన్నుల వ్యర్ధాలు రోడ్లపై చెల్లాచెదురుగా పడ్డాయి. మరోవైపు హైదరాబాద్ నగర గాలి కాలుష్యం విపరీతంగా పెరిగింది. తెల్లవారుజామున జీహెచ్ఎంసీ కార్మికులు రోడ్లపై ఉన్న టపాసుల వ్యర్ధాలను ఎక్కడికక్కడ క్లీన్ చేశారు. రోడ్లు క్లీన్ చేయడంలో కార్మికుల సేవలు బభేష్ అని పలువురు ప్రశంసించారు.