WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కుక్ పోస్టుకు దరఖాస్తులు కోరుతున్నట్లు మండల విద్యాశాఖ అధికారి గాయపు లింగారెడ్డి, కస్తూర్బా గాంధీ స్పెషల్ ఆఫీసర్ నాజియా సల్మా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు అని, 18 నుంచి 45 సంవత్సరాల మధ్యన ఉండాలి అని తెలిపారు.