NTR: మైలవరం మండలంలోని వెల్వడంలో గత ప్రభుత్వం లక్షలు వెచ్చించి 2 ఎకరాల్లో చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసింది. తడి, పొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్ ఎరువులు తయారుచేసి రైతులకు అందించాలనేది ప్రధాన ఉద్దేశం. అయితే, దీనికి విరుద్ధంగా చెత్తను డంపింగ్ యార్డ్‌కు తరలించకుండా గ్రామం చుట్టూ, రోడ్డు వెంబడి వేయడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.