SRCL: విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మనకు స్ఫూర్తిదాయకమని బెటాలియన్ కమాండెంట్ సురేష్ అన్నారు. సిరిసిల్ల పరిధిలోని సర్దాపూర్ బెటాలియన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు వారు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతిభద్రతలను కాపాడుతూ అవసరమైతే ప్రాణ త్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనకాడరని కొనియాడారు.