MLG: వెంకటాపురం మండలంలోని మరికాల గ్రామంలో కుటుంబ కలహాలతో బోట్ కిరణ్(30) అనే రైతు మంగళవారం గ్రామ శివారు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.