SKLM: రూరల్ రాగోలులో జడ్పీ సీఈవో డి.సత్యనారాయణ సోమవారం చెత్త సంపద కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం వర్మీ కంపోస్టు తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ఐవిఆర్ఎస్ కాల్స్, చెత్త సేకరణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వి.ప్రకాశరావు, పంచాయతీ కార్య దర్శి తిరుమలదేవి, సిబ్బంది పాల్గొన్నారు.