దీపావళి పండుగ సందర్భంగా ప్రధాని మోదీ గోవా సముద్ర తీరంలో ఉన్న INS విక్రాంత్‌పై వేడుకల్లో పాల్గొన్నారు. నేవీ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన దీపావళి జరుపుకున్నారు. ‘INS విక్రాంత్‌పై దీపావళి జరుపుకోవడం నాకు గర్వంగా ఉంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశాన్ని, సరిహద్దులను కాపాడుతున్న సైనికులకు ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.