MNCL: భీమారం మండలంలోని ఎస్సీ కాలనీకి చెందిన గాలిపల్లి తారక్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్వేత ప్రకటనలో తెలిపారు. కొన్ని నెలలుగా కారు మెకానిక్ పని నేర్చుకున్న తారక్ శిక్షణ అనంతరం సొంతంగా కారు మెకానిక్ షెడ్డు ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఇదే విషయమై తండ్రికి చెప్పగా డబ్బులు లేవన్నాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.