HNK: ప్రభుత్వ ఆదాయం కోసం విలువైన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టడాన్ని BJP తీవ్రంగా వ్యతిరేకిస్తోందని HNK జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ హెచ్చరించారు. కుడా ఆధ్వర్యంలో బాలసముద్రంలోని 2.27ఎకరాల (12,957 చదరపు గజాల) ప్రభుత్వ భూమిని బహిరంగ వేలంపాట ద్వారా విక్రయించాలని చూడటం దారుణమని మండిపడ్డారు. తరాల కోసం కాపాడాల్సిన భూములు అమ్మడం బాధ్యతారాహిత్యం అన్నారు.