KRNL: ఆలూరు మండలం పెద్దహాతూరు గ్రామంలోని శ్రీహుచ్చు వీరప్ప తాత దేవాలయంలో నవంబర్ 3న గోపుర ప్రారంభోత్సవం, కళశ ప్రతిష్టాపన మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజును కలిసి ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారు.