SRD: సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడిగా సంగారెడ్డికి చెందిన మాణిక్యంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సదాశివపేటలో జరిగిన జిల్లా మహాసభలో మాణిక్యం ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షుడు మల్లేశం సోమవారం తెలిపారు. మాణిక్యం మాట్లాడుతూ.. తనకు రెండోసారి జిల్లా ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సమస్యలపై ముందుంటానని పేర్కొన్నారు.