WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ వరి పంటలు కోత దశకు చేరాయి. చేన్లు బంగారు రంగులోకి మారడంతో రైతులు కోతకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే వాతావరణ మార్పులతో పంట నష్టం భయంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జిల్లాలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు సోమవారం కోరుతున్నారు.