టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ‘శర్వా 36’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయింది. దీనికి ‘బైకర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మోటార్‌సైకిల్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.