SKLM: జిల్లా యాదవ సామాజిక వర్గం అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ నర్తు రామారావును ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆదివారం యానాంలో జరిగిన అఖిల భారత యాదవ మహాసభలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరిరకి చెందిన యాదవ సామాజిక వర్గం నాయకులు నర్తు రామారావును శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.