BDK: భద్రాచలం పట్టణంలో గ్యాంగ్ వార్ కలకలం సృష్టించినట్టు సోమవారం స్థానికులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం పాత మార్కెట్ వద్ద యువకులు ఘర్షణకు దిగగా ఈ దాడిలో జగదీష్ నగర్ కాలనీకి చెందిన ప్రవీణ్ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.