NLG: గీత కార్మికుల హక్కుల కోసం గీత పనివారల సంఘం నిరంతరం పోరాడుతుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడిగ సైదులు అన్నారు. సంఘం 68వ వార్షికోత్సవం సందర్భంగా చిట్యాలలో సంఘం నాయకులతో కలిసి సోమవారం జెండాను ఆవిష్కరించారు. 5 లక్షల ఎక్స్ గ్రేషియా, 50 ఏండ్ల వారికి పెన్షన్ సాధించామన్నారు. కార్యక్రమంలో దేశగాని బాలరాజు, గుండాల సత్తయ్య గౌడ్, పాపయ్య పాల్గొన్నారు.