AP: HYD మాదాపూర్లో హైడ్రా బాధితులతో కలిసి సున్నంచెరువు ప్రాంతాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. కో ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ వాసులతో ప్లాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపి, వారి కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని లేదంటే ఊరుకునది లేదని హెచ్చరించారు.