SRPT: మఠంపల్లి మండలంలోని మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలోకి పులిచింతల ప్రాజెక్ట్ నుంచి భారీ వరద నీరు వచ్చి చేరింది. కరకట్ట గోడల్లో ఏర్పడిన లీకేజీల వల్ల ఆలయంలోకి అడుగు మేర నీరు ప్రవేశించింది. ప్రస్తుతం 44 టీఎంసీల నీటితో ప్రాజెక్ట్ నిండిపోవడంతో నీటి ఒత్తిడి పెరిగింది. మోటర్లతో నీటిని బయటకు పంపించే పనిలో అధికారులు నిమగ్నమైయ్యారు.