MHBD: కొత్తగూడ మండలం కార్లాయి గ్రామానికి చెందిన కల్తి గోవింద్ ఈనెల 18న మేకలు కాయడానికి అడవికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు అడవిలో గాలించగా అటవీ ప్రాంతంలో కుళ్ళిపోయిన మృత దేహాన్ని సోమవారం సాయంత్రం చూసి గోవింద్దిగా గుర్తించారు. కడుపులో నుంచి పేగులు బయటికి రావడంతో అడవి బర్రె పొడిచినట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదుచేశారు.