NTR: పండుగ వేళ విజయవాడలోని ఏలూరు రోడ్డులో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. మాల్ టెర్రస్‌పై ఉన్న చీరలు, అట్టపెట్టెలపై బాణాసంచా వచ్చి పడటంతో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన మాల్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. గవర్నర్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.