KDP: దీపావళి సందర్భంగా ప్రొద్దుటూరులోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం అమ్మవారి శాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి విశేషంగా అభిషేకాలు చేశారు. సాయంత్రం అమ్మవారికి లక్ష్మీ పూజలు చేపట్టారు. రాత్రి అమ్మవారికి కరెన్సీ నోట్లను అలంకరించి భక్తులకు ధనలక్ష్మీ అలంకరణలో దర్శన భాగ్యం కల్పించారు.