KMR: బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ (38) దక్షిణాఫ్రికాలో సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన పనిచేసే కంపెనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కనిపించారు. స్నేహితులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ ది హత్యా లేక ఆత్మహత్యా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.