JGN: పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో బుధవారం రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. గ్రామానికి చెందిన ఇరెల్లి ఎల్లమ్మ(65) అనే వృద్ధురాలు రోడ్డు దాటుతుండగా ఇప్పగూడెం గ్రామానికి చెందిన యువకుడు బైక్‌తో ఢీ కొట్టడంతో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు .