TG: వరంగల్ RTA కార్యాలయంలోని MVIకి ఏసీబీ అధికారులమంటూ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించినట్లు తెలుస్తోంది. అరెస్టు చేయడానికి వస్తున్నామని బెదిరించడంతో.. అధికారి వెంటనే రూ.2 లక్షలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. మరుసటి రోజు ఫోన్ చేసి మరో రూ.8 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.