TG: కుమురం భీమ్ జయంతి సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆయనకు ఘన నివాళులర్పించారు. ‘జల్, జంగల్, జమీన్’ (నీరు, అడవి, భూమి) అనే నినాదంతో పోరాడిన ధీరుడు కుమురం భీమ్ అని మంత్రి కొనియాడారు. ఆయన ఆశయాలను, పోరాట స్ఫూర్తిని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని ఈ సందర్భంగా పొంగులేటి తెలిపారు.