KDP: ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పింది, మడమ తిప్పింది అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ఇంతన్న డంతన్నడే గంగరాజు,ముంతమామిడి పండన్నాడే గంగరాజు అని తప్పుచేసి పప్పుకూడు సినిమాలోని పాట లాగా ఉందని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.