ATP: జిల్లాలో నేటి నుంచి పోలీసు అమరవీరుల వారోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 31 వరకు నిర్వహించనున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా నేడు స్మృతి పరేడ్, పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తామని పేర్కొన్నారు. దేశ సేవలో మరణించిన అమరవీరులను స్మరించుకుంటూ ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.